పి ఓ డబ్ల్యు ల ఐక్యత సభను జయప్రదం చేయాలి
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్: పి ఓ డబ్ల్యు ల ఐక్యత సభను జయప్రదం చేయాలి ఆత్మకూర్ ఎస్.. 24న మంచిర్యాలలో జరుగు పి ఓ డబ్ల్యు లో విలీనం సభ ను విజయవంతం చేయాలనిప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సక్క తెలిపారు.బుధవారం మండల పరిధిలోని తుమ్మల పెంపహాడ్ లో ఐక్యత సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సామాజిక ఆర్థిక రాజకీయంగా సమానత్వం లక్ష్యంగా పి ఓ డబ్ల్యు ఏర్పడిందని ఆనాటి నుండి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం మహిళలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రోజు రోజుకు మహిళలపై వేధింపులు హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నాయని వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని అన్నారు మనువాద భావజాలాన్ని పెంచి పోషిస్తూ స్త్రీని మరింత అనగదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు మహిళలు తమ హక్కుల జీవిత పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు 2013లో పి ఓ డబ్ల్యు నుండి వేరు పడినటువంటి వారు ఈనెల 24న మంచిర్యాలలో తిరిగి పి ఓ డబ్ల్యు లో విలీనం కానున్నట్లు తెలిపారు దీనికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనివిజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాగమ్మ విజయలక్ష్మి రేణుక కౌసల్య పూలమ్మ కలమ్మ తదితరులు పాల్గొన్నారు.