పారిశుధ్య కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Feb 5, 2026 - 18:11
 0  5
పారిశుధ్య కార్మికుని కుటుంబానికి  ఆర్థిక సహాయం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుని కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన గ్రామ పంచాయతీ వర్కర్స్ & యూనియన్ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు మండల కేంద్రం లోని శెట్టిగూడెం గ్రామం లో ఇటీవలే మరణించిన గురిజాల వెంకన్న గారి కుటుంబాన్ని పరామర్చించి ఆర్థికసాయంగా మండల కేంద్రంలోని గ్రామాల సిబ్బందులు తోచిన సహాయం గా ఇచ్చిన నగదు 5000/- రూపాయలను కార్మికుని భార్య గురిజాల నాగమ్మ గారికి గ్రామ పంచాయతీ వర్కర్స్ &యూనియన్ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు వారి కుటుంబానికి అందజేసిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పారిశుధ్య కార్మికుల బ్రతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఆరోగ్య భీమా, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ రాచకొండ పరమేష్, మూరగుండ్ల వెంకన్న,కార్మికుని భార్య గురిజాల నాగమ్మ, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు