పసికందుతో పాటు తాత ప్రాణం తీసిన నిర్లక్ష్యం: కారు డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్ష

Jul 15, 2026 - 20:29
 0  2
పసికందుతో పాటు తాత ప్రాణం తీసిన నిర్లక్ష్యం: కారు డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్ష

 ఇట్టి ప్రమాదం కేసులో తీర్పు వెల్లడించిన జే.ఎఫ్.సి.ఎమ్ కోర్టు అలంపూర్ నాయమూర్తి గారు   

⟹ పకడ్బందీగా సాక్ష్యాలను ప్రవేశపెట్టి,  శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను అభినందించిన ఎస్పీ

  అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా కారు నడిపి, నెలల పసికందుతో పాటు మరో వ్యక్తి మరణానికి కారణమైన డ్రైవర్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ,  అలంపూర్ కోర్టు  జే.ఎఫ్.సి.ఎమ్ కోర్టు జడ్జ్ ఆర్.వి.ఎస్.ఎస్. మిధున్ తేజ గారు ఈ తీర్పును వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐ‌పి‌ఎస్ గారు తెలిపారు.

కేసు వివరాలు: వనపర్తి జిల్లా నాచుపల్లి గ్రామానికి చెందిన స్రవంతి ప్రసవం కోసం తన పుట్టినిల్లయిన కొండపేట గ్రామానికి వచ్చింది. 2015 ఏప్రిల్‌లో నెల రోజుల బాబుకు టీకాలు వేయించడం కోసం స్రవంతి తల్లి గారు, నెలల శిశువుతో కలిసి మామ గట్టన్న గారి ద్విచక్రవాహనంపై జాతీయ రహదారి (NH-44) దాటుతున్నారు. ఆ సమయంలో హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తున్న ఇండికా కారు వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బాలుడు కిందపడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మామ గట్టన్న గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై అప్పటి ఇటిక్యాల ఎస్ హెచ్ ఓ భగవంత్ రెడ్డి గారు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేశారు. 

పోలీసుల కృషి - కోర్టు తీర్పు: అదనపు ఎస్పీ కె. శంకర్ గారి ఆదేశాల మేరకు, డీఎస్పీ మొగిలయ్య పర్యవేక్షణలో అలంపూర్ సర్కిల్ ఆఫీసర్ వి. ప్రదీప్ కుమార్, ఇటిక్యాల ఎస్సై రవి రాథోడ్ సాక్షులను పకడ్బందీగా కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడు ఎమ్.డి. ఫరూక్ నివాసం బండ్లగూడ హైదరాబాద్ కు ఒక  సంవత్సరం జైలు శిక్ష మరియు రూ.5000 జరిమానా విధిస్తూ  అలంపూర్ కోర్టు  జే.ఎఫ్.సి.ఎమ్ కోర్టు జడ్జ్ ఆర్.వి.ఎస్.ఎస్. మిధున్ తేజ గారు కోర్టు తీర్పు వెల్లడించారు.  బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారులు భగవoత్  రెడ్డి ఎస్సై, ప్రస్తుత ఇటిక్యాల ఎస్సై రవి రథోడ్ , అసిస్టెంట్ పిపి కార్తీక్ రాజ్ మరియు కోర్టు కానిస్టేబుల్ క్రాంతి కుమార్‌లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.                                                                                                                                                                                                                                                                        
                                                                                                                                                                                                                                                                        
... పి. ఆర్. ఓ.
జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333