పంట మార్పిడి పై అవగాహన

Aug 10, 2026 - 20:37
Aug 11, 2026 - 00:00
 0  10
పంట మార్పిడి పై అవగాహన

 తిరుమలగిరి 11 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఒకే పొలంలో ప్రతిసారీ అవే పంటలు వేయకుండా మారుస్తూ పండించడమే పంట మార్పిడి. దీనివల్ల నేల సారం , పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు అన్నారు రైతుతో మాట పంట మార్పిడికి బాట కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మండలం తొండ రాఘవపురం గ్రామాలలోని పెసర మరియు కంది పంటలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో వారు మాట్లాడుతూ పురుగులు, కలుపు తగ్గుతాయి. వరి తర్వాత అరుతడి లేదా కంది, పెసర మినుములు జొన్నలు వంటి పప్పుధాన్యాలు సాగు చేయడం ద్వారా రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గి అధిక దిగుబడి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాజర్ సర్పంచ్ స్వాతి, రాఘవాపురం సర్పంచ్ చిరంజీవి, పి ఎస్ డి సరిత, ఏఈఓలు భవ్య, మహిత మరియు రైతులు, పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి