పంట పొలాల్లో వరి కొయ్యలను, పంట వ్యర్ధాలను కాల్చవద్దు

May 22, 2026 - 17:22
 0  0
పంట పొలాల్లో వరి కొయ్యలను, పంట వ్యర్ధాలను కాల్చవద్దు

- పంట పొలాల్లో నిప్పు పెడితే భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, పోషకాలు నశిస్తాయి.
- భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గుతుంది, 
- పరిసరాల్లో ఉన్న విద్యుత్ మోటార్ల సామాగ్రి, గడ్డివాములు, ఇతర పంటలు కాలిపోయి రైతుకు ఆర్థిక నష్టం ఏర్పడుతుంది.
- రైతులు భూసారాన్ని,  పర్యావరణాన్ని కాపాడుకోవాలి.
.... సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్.

వరి కొయ్యలకు, పంట వ్యర్థాలకు నిప్పంటించడం వల్ల పరిసరాలు తగలబడి అందులో విద్యుత్ మోటార్లు, స్టారర్ లు, కరెంట్ తీగలు, గడ్డివాములు, ఇతర పంటలు కాలిపోయి రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుంది, దీని వల్ల భూమిలో ఉన్న పోషకాలు, క్రిమి కీటకాలు, సూక్ష్మజీవులు, భూసారం పెంచే వానపాములు మంటల్లో కాలిపోయి భూసారం తగ్గుతుందని తద్వారా పంటల దిగుబడి తగ్గుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. వరి కొయ్యలు కాల్చే క్రమంలో చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ మోటర్లు ఇతర సామాగ్రి గడ్డివాములు ఇతర పంటలు కాలిపోతున్న సంఘటనలు జిల్లాలో అక్కడక్కడ నమోదు అవుతున్నాయి అన్నారు. ఎండ తీవ్రత వడగాలి ప్రతివ్రత ఎక్కువగా ఉన్నది మంటలు వేగంగా చాలా ఎకరాల్లో వేగంగా వ్యాప్తి చెందుతాయి, ఇలా వ్యాప్తి చెందే మంటలు గ్రామాలను తాకే అవకాశం ఉన్నది అన్నారు. కావున పంట భూముల్లో పంట వ్యర్థాలు, వరి కొయ్యలు ఎవ్వరూ కాల్చవద్దు అని ఎస్పి కోరారు. రైతులు భూసారాన్ని,  పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మంటల వల్ల భూసారం తగ్గి ఎక్కువ ఎరువులు వేయాల్సి వస్తుంది, రైతుకు ఖర్చు పెరుగుతుంది. గాలి కాలుష్యం అవుతుంది. దట్టమైన పోగకమ్మి రోడ్డుప్రమాదాలు జరుగుతాయి.

కావున రైతులు పంట వ్యర్ధాలను భూమిలో కలయదున్నాలి, ఇది కంపోస్ట్, సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకోవాలి, పర్యావరనాణికి అనుకూలమైన పద్దతులు పాటించాలి. రైతు తమ ఆరోగ్యం, భూమి భవిష్యత్తు, పర్యావరణ రక్షణకోసం పంట వ్యర్థాలు కాల్చకుండా ఉండాలి అని కోరారు.

వరి కోయ్యలు తగలబెడుతూ ఇతరులకు నష్టం కలిగిస్తే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333