న ఎండిన పంట పొలాలకి నష్టపరియాలు చెల్లించాలి .....శానంపూడి సైదిరెడ్డి
మునగాల 04 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా సూర్యాపేట జిల్లా నుండి తాగునీటిని ఖమ్మం జిల్లా కు తరలించడం సరైన పద్ధతి కాదాని బిజెపి పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు.మండల పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి సాగర్ లెఫ్ట్ కెనాల్ కాలువను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీటితో చెరువులు, కుంటలు నింపకుండా తరలించడం సరైన పద్ధతి కాదని అన్నారు.ఎండిన పంట పొలాలకు ఇరవై ఐదు వెయ్యిలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.ఇప్పటికైన సాగర్ నీటి ద్వారా చెరువులు కుంటలు నింపాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు కృష్ణయ్య, సత్యనారాయణ, నూనె సులోచన, మల్లెబోయిన అంజి యాదవ్, మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు భద్రంరాజు కృష్ణ ప్రసాద్, దున్న సతీష్,మధు,నూకపంగు గుర్వయ్య,కోటి, పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.