*గ్రీన్ బెల్టు ల ఎగవేత....... కాలువలు అసైన్మెంట్ భూములు కలిపి దర్జాగా వెంచర్లు.....?

గ్రీన్ బెల్ట్ లఎగవేత..? కాలువలు అసైన్మెంట్లు భూములు కలిపి దర్జాగా వెంచర్లు...? *కూడబెట్టిన సొమ్ముతో...? అధికారం వైపు అడుగులు...? *ఓ నాలుగు ఎకరాలు వెనకేసుకున్న ఓ దళారి....? అనతికాలంలో కోట్లు కొల్లగొట్టిన ఘనులు...? *పాత వెంచర్లు నిబంధనలు విరుద్ధంగానే..? కొత్త వెంచర్లు మాత్రం నిబంధనల ప్రకారమే ఉన్నాయి... ఎంపీ ఓ వివరణ.. *ఇప్పటికీ అగ్రిమెంట్లు దశలోనే గ్రీన్ ఫీల్డ్ స్థలాలు...? *గ్రీన్ ఫీల్డ్ స్థలాలు కూడా కబ్జా కానున్నాయా...? తెలంగాణ వార్త: ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో సెప్టెంబర్ 8 రియల్ ఎస్టేట్ మాయాజాలం వలన నేలకొండపల్లి మండల కేంద్రంలో కొందరు అనధికారంలోనే కోట్లాది రూపాయలు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ దళారిగా వ్యవహరించిన ఓ పార్టీ నేత ఏకంగా నాలుగు ఎకరాల పొలాన్ని వెన కేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా కోదాడకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొన్ని సంవత్సరాల క్రితం సాదా సీదాజీవనం కొనసాగించి నేలకొండపల్లి మండల కేంద్రంలో వెంచర్ల నిర్మాణం చేసి భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసైన్మెంట్ భూమిని సైతం వెంచర్ లో కలిపి వ్యాపారం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రము నకు చెందిన ఓ తాజా మాజీప్రజా ప్రతినిధి అక్రమంగా వెనకేసుకున్న కాసులతో రానున్న స్థానిక సంస్థల సమరంలో పెట్టుబడిగా పెట్టి అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు గ్రీన్ ఫీల్డ్ ఇచ్చేందుకు గ్రామపంచాయతీకి అగ్రిమెంట్ అయితే చేశారు. కానీ నేటి వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని ఆరోపణలు ఉన్నాయి. ఏదో కంటి తూడు పు చర్యగా గ్రీన్ ఫీల్డ్ లో అగ్రిమెంట్లు అయినట్లు సృష్టించారు. కానీ అధికారులు దళారులు రియల్ ఎస్టేట్ సంస్థలు కుమ్మక్కై ఇప్పటికీ అట్టి స్థలాలు అగ్రిమెంట్ దశలో ఉండటం వలన భవిష్యత్తులో కబ్జాలకు గురయ్యే అవకాశం ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయాన్ని గండి కొట్టి మరి లక్షలాది రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నప్పటికీ అదేం పట్టించుకోకుండా తన వంతు ప్రయత్నం ముమ్మరం చేశారు. కాగా గ్రామపంచాయతీలో అవినీతి చర్యలు జరిగాయని అప్పటి పంచాయతీ కార్యదర్శి పై వేటు వేసిన సంగతి తెలిసిందే. నాడు అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా వ్యాపార లావాదేవీలు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిందనే ఆరోపణలు ఉన్నాయి. తాజా మాజీ సర్పంచ్ అదేసామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధి ఆగడాలకు అక్రమాలకు అడ్డుపద్దు లేకుండా కొనసాగిందనే అనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకున్న అధికారులు అవినీతికి పాల్పడిన పాలకవర్గంపై చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులు దళారులు బ్రోకర్లు ఏజెంట్లు రాజకీయ నాయకులు ఒక వేదిక లాగా ఏర్పడి ఎవరి పరిధిలో వారు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఎవరైనా సామాజిక కార్యకర్తగా గా నిపౌరుడు కానీ జిల్లా స్థాయిలో ఫిర్యాదులు చేస్తే బుట్ట దాఖలుచేసేందుకు సదరు సంస్థల వ్యక్తులు చొరవ తీసుకునే వారని దీంతో వారు వ్యవహరించిన తీరుగా అధికారులు కూడా వ్యవహరించే వారని పలువురు స్థానికులు అంటున్నారు. నేలకొండపల్లి మండలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు గ్రీన్ బెల్టు స్థలాలను ఎగనామం పెట్టిన వ్యవహారంపై మండల ఎంపీ ఓను తెలంగాణ వార్త ఖమ్మం జిల్లా ప్రతినిధి వివరాలు కోరగా పాత వెంచర్లకు అనుమతులు లేవు అని గత రెండు సంవత్సరాల క్రితమే నేలకొండపల్లి మండలానికి వచ్చానని కొత్తగా ఏర్పాటైన వెంచర్లు అనుమతులు ప్రకారమే ఉన్నట్టు చెప్పారు. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోడ్లు విద్యుత్ స్తంభాలు మొక్కల పెంపకం లాంటివి కొన్నిచోట్ల చేసినప్పటికీ కొన్నిచోట్ల అటువంటి పనులేమీ చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి ప్లాట్లు అమ్మకాలు చేశారని పలువురు పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో నేలకొండపల్లి మండలం కేంద్రంలో జరిగే దందా లపై కొందరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ నేలకొండపల్లి ప్రతి వెంచర్ల మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించినప్పటికీ నేటికి కూడా అటువంటి చర్యలు చేయకపోవడం విశేషం. అవినీతికి అలవాటు పడిన అధికారులకు పైసలను ఎరగా చూపి తమ పనులను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నేలకొండపల్లి మండల కేంద్రంలో ని రియల్ ఎస్టేట్ వెంచర్ల మాయజాలంపై దృష్టిని కేంద్రీకరించి తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన సంస్థలపై వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Sep 8, 2024 - 13:08
 0  51

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State