నేతాజీ సుభాష్ చంద్రబోస్  పట్టణంలోని 129 వ జయంతి వేడుకలు  

Jan 23, 2025 - 21:32
Jan 23, 2025 - 21:33
 0  2
నేతాజీ సుభాష్ చంద్రబోస్  పట్టణంలోని 129 వ జయంతి వేడుకలు  
నేతాజీ సుభాష్ చంద్రబోస్  పట్టణంలోని 129 వ జయంతి వేడుకలు  

మిర్యాలగూడ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఆధ్వర్యంలో

తెలంగాణ వార్త మిర్యాలగూడ జనవరి 23 :- మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ నందు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం నేతాజీ పాఠశాల విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతాజీ జీవితం వారి ఆలోచన విధానాలు నేటి యువతకు ఎంతో ఆదర్శం అని అన్నారు.  అజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి స్వతంత్రం కోసం వారు చేసిన కృషిని వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలి అని అన్నారు. వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు కౌన్సిలర్ కొమ్ము శ్రీను, శ్రవణ్, మరియు కాంగ్రెస్ నాయకులు  BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

Vallapudasu Kiran Miryalaguda Reporter Nalgonda Dist Telangana State