నేడే మండల ప్రత్యేక సమావేశం ఎంపీడీవో
జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండల ప్రత్యేక సమావేశము శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్నట్లు. మండల అభివృద్ధి అధికారి రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్లు వారు తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు వివిధ గ్రామాలసర్పంచులు అందరు విధిగా బాధ్యతతో రావాలని వారు కోరారు. ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికతో హాజరుకావాలని ఎంపీడీవో కోరారు. మండల ఎజెండా అంశాలు. వి బిజీ రాంజీ పథకంపై సమీక్ష. జలసిరి కార్యక్రమం. స్వచ్ఛభారత్ మిషన్ పై. 15వ ఆర్థిక సంఘం నిధులు క్రింద మంజూరు కాబడిన పన్నులపై సమీక్ష. అన్ని శాఖల ప్రగతిపై సమీక్ష. ఇతర అంశాలు మండల ప్రత్యేక అధికారా అనుమతితో నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో రమాదేవి, తెలిపారు.