నేడే కొండ సురేఖ రాజీనామా

Sep 3, 2026 - 20:12
Sep 3, 2026 - 20:18
 0  2
నేడే కొండ సురేఖ రాజీనామా

- మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయం
- మీడియా ముందుకు కొండ సురేఖ దంపతులు 
- రేపో మాపో సీఎం రేవంత్ రెడ్డి అవినీతిపై ఉక్కుపాదం

హైదరాబాద్ న్యూస్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ లోక్‌భవన్‌లోని గవర్నర్‌ కార్యాలయానికి ప్రభుత్వం లేఖ పంపినట్లు సమాచారం. దీంతో కొండా సురేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.

ఇప్పటికే కొండా సురేఖ రాజీనామా అంశంపై ఉదయం నుంచి పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధిష్ఠానం సూచనల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమెకు సూచించినట్లు సమాచారం. అయితే సురేఖ తన అనుచరులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం పార్టీలో కొనసాగడం అవమానకరంగా భావిస్తున్నట్లు, పార్టీకి కూడా రాజీనామా చేసే అంశంపై కొండా సురేఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తాజాగా ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసినట్లు వస్తున్న సమాచారంతో కొండా సురేఖ మంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్‌ కార్యాలయం నుంచి తదుపరి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333