నిలబెట్టుకోలేని వాగ్దానాలతో మంత్రిగా కొనసాగటం న్యాయమా? తుమ్మల

Oct 14, 2024 - 19:22
Oct 14, 2024 - 20:56
 0  3
నిలబెట్టుకోలేని వాగ్దానాలతో మంత్రిగా కొనసాగటం న్యాయమా? తుమ్మల

నిలబెట్టుకోలేని వాగ్దానాలతో మంత్రిగా కొనసాగటం న్యాయమా? తుమ్మల..

రైతు రుణమాఫీపై వాగ్దానాన్ని నిలబెట్టు కోలేకపోతూ రోజుకో మాట మార్చుతూ మంత్రిగా కొనసాగటం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు న్యాయం కాదని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వాగాంబడరంలో శూరత్వమే తప్ప చేతల్లో ప్రయోజనం చూపటం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేండ్లుగా తన రాజకీయ జీవితంలో సమర్థుడిగా పేరు తెచ్చుకున్న తుమ్మల నేడు రేవంత్ రెడ్డి స్వార్ధ, మోసపూరిత రాజకీయాల బురదను అంటించుకొని ప్రజల ముఖ్యంగా రైతుల అభిమానానికి దూరం అవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ గురించి ఈ పది నెలల కాలంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట మీద ఏనాడూ నిలబడక పోగా మాటలు మార్చుతూ రైతుల్ని నానా ఇబ్బందులకు, వ్యయప్రయాసలకు గురి చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల ముందు సోనియా పుట్టిన రోజున రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి ఐన తరువాత వచ్చే సోనియా గాంధి పుట్టిన రోజున అప్పు తెచ్చి రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తామనటం ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని చెప్పారు. తుమ్మలకు ఏమాత్రం నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం ఉన్నా రుఫీమాఫీ డబ్బులు తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, చేతగాని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేసి రైతుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State