నిరక్షరాశులయిన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి..... ఎంపీడీవో రమేష్ దీన దయాల్
మునగాల 08 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- నవభారత్ సాక్షరత కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం శిక్షణ కార్యక్రమం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఎంపీడీవో రమేష్ దీన దయాల్ మాట్లాడుతూ. నిరక్షరాశులయినా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దటానికి , చదవటం, వ్రాయటం, నేర్చుకోవడం వలన సమాజంలో మోసపోకుండా ఉంటారని తెలియపరిచారు. అలాగే ఎంఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. 15 సంవత్సరాల పైబడిన నిరక్షరాశులను గుర్తించి 100 శాతం ప్రాథమిక అక్షరాసులుగా తీర్చిదిద్దడంతో సమాజంలో దొపిడికి గురి కాకుండా, కుటుంబ అభివృద్ధికి తోడ్పడతారని అన్నారు. ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమాన్ని మండల స్థాయిలో వేగవంతం చేస్తామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం అరుణాకర్, ఆర్పీలు ఉపేందర్, కోటేశ్వరరావు, సిఆర్పీలు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, వివోఏ పాల్గొన్నారు.