నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందే కమ్యూనిస్టు పార్టీ

తిరుమలగిరి 14 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తెలంగాణ సాయుధ పోరాట 76 వార్షికోత్సవాలలో భాగంగా జాత తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో మొదలవగా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సాయిధర పోరాటంలో పోరాటం చేసింది కేవలం కమ్యూనిస్టులని, నేడు బిజెపి పార్టీ చరిత్రను వక్రీకరించి అపాస్ పాలు చేస్తున్నాయని, నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కాపాడింది భారత కమ్యూనిస్టు పార్టీ అని, నేడు తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి, నాగారం,మద్దిరాల, నూతనకల్, సూర్యాపేటలో ఈ జాత కొనసాగుతుందని, తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరించుకుంటూ ఊరురా కొనసాగు తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లముల యాదగిరి,కంబాల శీను, మాండవ వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, దేవరనేని మల్లేశ్వరి, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు కోటమ్మ, తిరుమలగిరి మండల కార్యదర్శి ఎండి ఫయాజ్ , తుంగతుర్తి మండల కార్యదర్శి పాల్వాయి పున్నయ్య , రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, కొండ గ్రామ కార్యదర్శి కనుక అశోక్,వ్యవసాయ సంఘం మండల కార్యదర్శి కొమురెల్లి , వ్యవసాయ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ఇక్బాల్, గుగులోతు రాజారాం , కోటా రామస్వామి, సుంచు సత్తయ్య , కుదురుపాక ఉప్పలయ్య,వాడపల్లి అశోకు, ముత్యాల యాకస్వామి,నాగుల గాని మల్లయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి జంపాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.