నాసిరకం పనులపై గ్రామస్తుల ఆగ్రహం
చెరుకూరు నుండి చింత్తూరు వరకు 2025-26 ఎమ్మెల్యే సి ఆర్ ఆర్ నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణాల దుస్థితి..!
నాణ్యతపై పర్యవేక్షణ కరువు
నాసిరకం పనులపై గ్రామస్తుల ఆగ్రహం..!
తెలంగాణ వార్త వాజేడు :- మాజేడు మండల పరిధిలోని చింతూరు నుండి చెరుకూరు వరకు అభివృద్ధి పనులపై చేపట్టిన సిమెంట్ రోడ్డు నాసిరకంగా నిర్మించడం చాలాబాధాకరమని, కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్లు నిర్మించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మిస్తున్న రోడ్లు నాసిరకంగా ఉండడం వల్ల 6 నెలలలోపే దెబ్బతింటాయని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతారని , అటు ప్రజాధనం దుర్వినియోగం కూడా. అవుంతుందని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.