నాటు కోళ్లపై విష ప్రయోగం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Dec 15, 2024 - 18:27
Dec 15, 2024 - 18:40
 0  207
నాటు కోళ్లపై విష ప్రయోగం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

అడ్డగూడూరు 15 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో నాటు కోళ్ల షెడ్లో కోళ్లపై విష ప్రయోగం చేసిన గుర్తు తెలియని దుండగులు.సుమారు 82 కోళ్లు మృత్యువాత పడ్డాయని కోళ్ల షెడ్ యజమాని చిప్పలపల్లి శ్రీను తెలిపారు.ఎవరో గుర్తుతెలియని దుండగులు కక్షపూరిత ధోరణితో వ్యక్తిగతంగా చూసుకోలేకనా కోళ్ల షెడ్ పై ఈ రకంగా విషం చల్లారని కన్నీటి పర్యంతమయ్యారు.వెటర్నరీ వైద్యులు చనిపోయిన కోళ్లకు పరీక్ష చేసి ఏ కారణం చేత చనిపోయాయో తేల్చాలని విజ్ఞప్తి చేశారు.గ్రామస్తులు మాట్లాడుతూ..స్వయం ఉపాధితో ఎదగాలని ప్రయత్నం చేస్తున్న రైతు శ్రీనును మానసికంగా దెబ్బతీయడానికి ఈ ప్రయత్నానికి పాల్పడ్డారని శ్రీను పిర్యాదును పోలీసులు స్పందించి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.విష ప్రయోగము మంత్రాల నేపమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక గిరిరాజా పెద్ద కోడిని చంపి పాతిపెట్టారని షెడ్ చుట్టూ పరీక్షించి చూస్తే క్షుద్ర పూజ మాదిరిగా ఆనవాళ్లు బయటపడ్డాయని చెప్పుకొచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333