నందిగామ"జర్నలిస్ట్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

Sep 6, 2025 - 19:21
Sep 6, 2025 - 19:26
 0  24
నందిగామ"జర్నలిస్ట్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

జర్నలిస్ట్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి..

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి రా వెళ్ళ : నందిగామ ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ పై దాడిని ఖండిస్తున్నాం టీడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్, నరేష్ నందిగామ మండల ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ సందీప్ పై దాడిని టీడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్, నరేష్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్, నరేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల పై దాడులు చేయడం సరైన విధానం కాదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.సందీప్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడడం ఏంటని విమర్శించారు. ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలని, ఇలాంటి దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. దాడి కి పాల్పడిన వారు ఎవరైనా సరే వారిని గుర్తించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు...

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State