ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
తిరుమలగిరి 13 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం ఆయన నాగారం, జాజిరెడ్డి గూడెం, తిరుమలగిరి మండలాల్లోని తిమ్మాపురం, ఇటూరు, తొండ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం నాగారం మరియు తిరుమలగిరి పరిధిలోని వాసవి రైస్ ఇండస్ట్రీ, ఏఎస్ఆర్ రైస్ ఇండస్ట్రీ , సోమేశ్వర రైస్ ఇండస్ట్రీ మిల్లులను సందర్శించి, ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఆన్ లోడింగ్ చేయాలని, మిల్లర్లు ధాన్యం దిగుమతిలో జాప్యం చేయకూడదని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట తిరుమలగిరి నాగారం మండలం తహసిల్దార్లు, ఆర్ ఐ లు, ఎంపీడీవోలు కంట్లమయ్య రైస్ మిల్లర్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు...