దొడ్డి కోమరయ్య అమరత్వం స్ఫూర్తితో ఉద్యమించాలి

Jul 4, 2024 - 19:46
 0  4
దొడ్డి కోమరయ్య  అమరత్వం స్ఫూర్తితో ఉద్యమించాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ దొడ్డి కొమరయ్య అమరత్వం స్ఫూర్తితో ఉద్యమించాలి పి వై ఎల్ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య భూమి భుక్తి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పి వై ఎల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ పాల్గొని మాట్లాడుతూ 1940 దశకంలో తెలంగాణ మాగానం ఎట్టి బతుకుల నుండి మట్టి మనుషులను మహావీరులుగా మలిసింది నిజాం రాచరికపు వ్యవస్థలకు నాడు భూస్వామ్య వ్యవస్థ పునాదిగా ఉండేది అని అన్నారు సాయుధ పోరాటం ద్వారా ఆ వ్యవస్థను కూలదోచారు దేశ్ముకులు భూస్వాములు గడిల నుండి పరారయ్యారు ఈ సాయిధ పోరాటంలో మొదటి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 1946 జులై 4న విసునూరు దేశ్ముఖ రామచంద్రారెడ్డి గుండాలు జరిపిన కాల్పులలో కామ్రేడ్ కొమరయ్య అమరుడైనాడు అని అన్నారు ఎర్ర జెండా వెలుగులో కమ్యూనిస్టులు ఇచ్చిన పిలుపుమేరకు పీడిత ప్రజలు నిజం రాజు పై తిరుగుబాటు చేశారు 1946 - 52 మధ్య జరిగిన ఈ సాయుధ పోరాటంలో 4000 వేల మంది ప్రాణాలు కోల్పోయాయి అని అన్నారు 2000 గ్రామాల్లో ప్రజారాజ్యం ఏర్పాటు చేసుకున్నారన్నారు భూస్వాముల ఆధీనంలో ఉన్న 10 లక్షల ఎకరాల భూమిని ప్రజల స్వాధీనం చేసుకున్నారు కుల మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యమయ్యారు ముస్లిం రాజులను హిందూ భూస్వాములను తరిమికొట్టారు అయినా దేశంలో భూ సమస్య పరిష్కారం కాలేదు పైగా మరో రూపంలో భూ కేంద్రీకరణ పెరుగుతుంది 80 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో అర్థవలస అర్థ భూస్వామ్య వ్యవస్థ కొనసాగుతుంది నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాడు స్ఫూర్తితో నేటి విప్లవకారులు పోరాడాలి త్యాగాలకు సిద్ధపడాలి అన్నారు ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సక్క సుమంత్ లింగయ్య మల్లయ్య భరత్ తదితరులు పాల్గొన్నారు