దేశం కోసం పోరాడిన రియల్ హీరో ప్రాణాలతో చెలగాటమా
మాజీ IPS, బడుగు బలహీన వర్గాల గొంతుక R.S. ప్రవీణ్ కుమార్ గారి భద్రతను (X-Category) కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించింది. లా అండ్ ఆర్డర్ చూసే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది తెలిసే జరుగుతోందా? ఎందుకీ కక్షసాధింపు?
రాష్ట్రపతి శౌర్య పతకం పొందిన ఆఫీసర్ ఆయన. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభాలు వచ్చినప్పుడు, ప్రాణాలకు తెగించి ముందు వరుసలో నిలబడిన వ్యక్తి. ఆయన ప్రాణాలకు ఉన్న ముప్పును గుర్తించే కదా గత ప్రభుత్వాలు భద్రత కల్పించాయి? ఇప్పుడు ఆ ముప్పు సడెన్ గా ఎలా పోయింది?
2021లో ఆయన తన పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలో చేరినప్పుడు కూడా.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన సెక్యూరిటీని తగ్గించలేదు. కానీ నేడు వ్యవస్థల వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్షకట్టి భద్రతను ఉపసంహరించుకున్నారా?
ఒక దళిత బిడ్డ, నిజాయితీ గల ఆఫీసర్ పై ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి చేటు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరి ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకుంది?
ప్రజా గొంతుకను అణచివేయలేరు! ✊
ఈ పోస్ట్‌ను షేర్ చేసి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.
#IamRSP RS Praveen Kumar