శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న అక్షోభ్య తీర్థ మఠ పీఠాధిపతులు

Jun 26, 2026 - 19:53
 0  1
శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న అక్షోభ్య తీర్థ మఠ పీఠాధిపతులు

 జోగులాంబ గద్వాల 26 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : శ్రీమద్వాచార్యుల మూల మహాసంస్థానం శ్రీ అక్టోభ్య మఠ పీఠాధిపతులైన శ్రీ అక్టోభ్య రామ ప్రియ తీర్థుల వారు శుక్రవారం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ చైర్మన్ పట్వారి ప్రహల్లాదరావు, అర్చకులు వాల్మీకి పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు , స్వామివారి మంగళహారతులు నిర్వహించారు. తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ శేషదాసుల సన్నిధానంలో స్వాములవారి పూజ అనంతరం మాట్లాడుతూ దేవాలయం ఎంతో చరిత్ర కలిగి ఉందని భక్తులు శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకుని పునీతులు కావాలని కోరారు. భక్తులను ఆదుకునేందుకు స్వామి వారు ఎన్నో రూపాలలో మనకు కనిపిస్తారని మనస్సులో భక్తి భావం ఉన్నప్పుడు స్వామి కోరిన కోరికలు తీరుస్తాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధీరేంద్ర దాస్ రాఘవేంద్ర దాస్ శశాంక చంద్రశేఖర రావు బాబురావు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333