దళితులకు కోసం వచ్చిన 11 కోట్లు దళితులకు ఖర్చు చేయకుండా వెనక్కుపంపించి దళితులకు అన్యాయం

Feb 20, 2025 - 15:29
Feb 20, 2025 - 20:00
 0  2

గద్వాల జిల్లాలో భూమిలేని దళితులకు కోసం వచ్చిన 11 కోట్లు దళితులకు ఖర్చు చేయకుండా వెనక్కుపంపించి దళితులకు అన్యాయం చేశారు* 

భారత్ మాల రోడ్లకు, వివిధ ప్రాజెక్టులకు వందల ఎకరాల భూములు దొరుకుతాయి, కానీ దళితులకు మాత్రమే భూములు దొరకడం లేదా* 

గద్వాల ఎస్సి కార్పొరేషన్ ED రమేష్ బాబును ఆ కుర్చీ నుండి తొలగించాలి*

మాచర్ల ప్రకాష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జోగులాంబ గద్వాల జిల్లా*

జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లా లో భూమి లేని నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి కోసం గత ప్రభుత్వంలో వచ్చిన 11 కోట్ల రూపాయలు కార్యాలయాలలో ఏసీ రూములలో కూర్చొని భూమిదొరకలేదనే సాకుతో 11 కోట్ల రూపాయలు దళితుల అభివృద్ధికి, జీవనోపాదికి వినియోగించకుండా ఖర్చు చేయకుండా వెనక్కి పంపించి దళితులకు తీవ్రమైన అన్యాయం ఎస్సి కార్పొరేషన్ ED రమేష్ బాబు, తహసీల్దార్లు చేసారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం జిల్లా అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాచర్ల ప్రకాష్ అన్నారు,  7 లక్షలకు ఒక ఎకరా భూమి దొరుకుంతుందని కానీ అధికారులు దళితుల కోసం భూములు చూడకుండా భూములు దొరకడం లేదని తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా 11 కోట్ల రూపాయలు దళితుల నోటి దగ్గరికి వచ్చిన డబ్బులు మనకు ఖర్చు చేయకుండా వెనక్కు పోవడం చాలా అన్యాయం అక్రమం అని అన్నారు, భారత్ మాల రోడ్లకు, వివిధ ప్రాజెక్టులకు వందల ఎకరాల భూములు 4,5,లక్షలకు దొరుకుతాయి కానీ దళితులకు మాత్రమే భూములు దొరకడం లేదా అన్నారు గట్టు, కేటీ దొడ్డి మండలాలో 7 లక్షలకు ఎకరా దొరికేవని కానీ అధికారులు కుట్ర చేసి 11 కోట్ల రూపాయలు దళితులకు వినియోగించకుండా కుట్ర చేసారని అన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు అన్యాయమే జరుగుతుందని నిరుపేద దళితులను అధికారంలో ఉన్న వారు దళితులను అభివృద్ధి చేయడం లేదని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం దళితులకు బడ్జెట్ లో కెటాయించిన 25 వేలకోట్లు నిధులు దళితుల కోసం ఖర్చు చేయడం లేదని దళితులకు భూములు, వ్యాపారాలు లేకుండా, జరిగే కుట్ర వేల యేండ్ల నుండి జరుగుతుందని దళితులె వారి అభివృద్ధి కోసం ప్రాణాలికలు వేసుకొని ప్రభుత్వంతో పోరాడాలని అన్నారు. వెనకకు వెళ్లిన 11 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి గద్వాలకు ఇవ్వాలని భూములు మేము చూపిస్తామని అన్నారు దళితుల ఐక్యమంత్యంతో బెరసారాలు ఆడే రాజకీయాలు,శక్తిని పెంపోందించుకోవాలనీ దళితులు ఐక్యమత్యం కావాలని కోరారు,11 కోట్ల రూపాయలు వెనక్కి పంపేలా చేసి దళితులకు అన్యాయం చేసిన జోగులాంబ గద్వాల ఎస్సి కార్పొరేషన్ ED రమేష్ బాబు గారిని ఆ కుర్చీ నుండి తొలగించాలనీ డిమాండ్ చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333