దనలన్నాంటి లో అన్న దానం గొప్పది.

Oct 5, 2024 - 17:00
Oct 5, 2024 - 19:48
 0  29
దనలన్నాంటి లో అన్న దానం గొప్పది.

దానాలన్నింటిలో అన్నదానం గొప్పది

సూర్యాపేట 05.10.2024.తెలంగాణ వార్త జిల్లా ప్రతినిధి:- సూర్యాపేట :దానాలన్నింటిలో అన్నదానం గొప్పదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మోత్కూరి సందీప్, మాజీ కౌన్సిలర్ ఎలుగూరి అలివేలు చంటి బాబు, నాయకులు జమాల్పూర్ పండరీ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహం వద్ద గొబ్బిళ్ళ కరుణాకర్, శివ నాయుడు, సతీష్ నాయుడు వీరేష్ నాయుడు ఆధ్వర్యంలో కొప్పుల సతీష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. గత 18 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదాన గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223