త్రాగు నీటిని వృధా చేయకూడదని ప్రచారం చేసే అధికారులే... కార్లు కడగడానికి మంచి నీటిని వాడేస్తున్నారు
జోగులాంబ గద్వాల 13 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలోని వేసవి కాలంలో త్రాగునీరు సంక్షోభం ఎదుర్కొంటున్న జోగులాంబ గద్వాల్ జిల్లాలో శుక్రవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తమ సొంత కార్లు కడగడానికి ప్రభుత్వ కార్యాలయాల్లోని మంచి నీటిని వృధా చేస్తున్నారు. “త్రాగే నీటిని వృధా చేయకండి” అని గ్రామాల్లో ప్రచారం చేస్తున్న అధికారులే ఈ వ్యవహారానికి పాల్పడడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో వేసవి తీవ్రతతో త్రాగునీరు లభ్యం కాకుండా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. త్రాగు నీటి కోసం గంటల తరబడి ప్రజలు వేచి ఉండాల్సి వస్తోంది. మహిళలు, పిల్లలు నీటి కోసం కాళ్లు వాచినా, అధికారులు మాత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో తమ అధికారిక వాహనాలు, సొంత కార్లను కడుగడానికి మంచి నీటిని వాడేస్తున్నారు.
“ప్రభుత్వం నీటి సంరక్షణకు కోట్లు ఖర్చు చేస్తుంటే, ఇక్కడ అధికారులు మాత్రం నీటిని కార్లు కడిగేందుకు వృధా చేస్తున్నారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.