తెలంగాణ సంస్కృతి  సాంప్రదాయాలకు ప్రతీక బోనాల మహోత్సవ పండగ

Aug 11, 2024 - 15:40
Aug 11, 2024 - 15:49
 0  2


 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి *రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలి 

 తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ 

 
 (సూర్యాపేట టౌన్ ఆగస్టు 11) 
 

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల  మహోత్సవ  పండుగ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి అని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్  అన్నారు. ఈరోజు ఉదయం అమ్మవారిని కుటుంబ సమేతంగా  దర్శించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట ముత్యాలమ్మ గుడి దగ్గర  ఈరోజు ఉదయం ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి దేవాలయాలను అభివృద్ధి చేయాలి అని అన్నారు. జిల్లాల వారిగా గ్రామాల వారీగా దేవాలయాలను అభివృద్ధి చేయాలి అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని అన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం కరోనా లాంటి వైరస్ వ్యాధులు సోకి తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అని అన్నారు అలాంటి   వ్యాధులు రాకుండా అమ్మవారు కాపాడాలని కోరుకున్నారు వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా వెయ్యి కండ్లతో కాపాడమని అమ్మవారిని మొక్కే పండుగ బోనాల ఉత్సవం పండగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పండుగ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333