తెలంగాణ వార్తకు స్పందించిన అధికారులు

తిరుమలగిరి 28 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామంలో జోరుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. సిఫై ఇన్ఫ్రా కంపెనీ వారు గత ప్రభుత్వ హయంలో చెక్ డ్యాం నిర్మాణం కోసం దాదాపు 250 ట్రిప్పుల ఇసుకను డంపు చేశారు. ఆ ఇసుకను గుర్తుతెలియని కొంతమంది అక్రమ ఇసుక రవాణా చేశారు.ఈ విషయంపై శుక్రవారం ప్రచురించిన తెలంగాణ వార్త పత్రికలో సీజ్ చేసిన ఇసుకను కాజేసిండ్రు కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించి ఇసుక డంపును పరిశీలించారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ జాన్ మొహమ్మద్ మాట్లాడుతూ ఇసుక తరలింపు పై పూర్తి విచారణ జరిపి ఎంతటి వారైనా సరే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆయన వెంట రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాబా ఉన్నారు