తెలంగాణ యువజన సంఘము ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం లో తెలంగాణ యువజన సంఘము ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ సహకారంతో ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.
ఈ హెల్త్ క్యాంప్ కి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని సింధు వైద్యశాల వైద్యుల బృందం తెలిపారు .
తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు మరియు సింధు హాస్పిటల్ ( హైదరాబాద్ ) చైర్మన్ బండి పార్థ సారథి రెడ్డి గార్ల సహకారం తో,
తెలంగాణ యువజన సంఘము ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్ లో వైద్యుల బృందం క్యాన్సర్, కార్డియాక్, గైనిక్ తదితర సమస్యలతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించటం జరిగింది.
ఉచిత హెల్త్ క్యాంప్ కి హాజరైన వారందరికీ అన్ని పరీక్షలు పూర్తి చేసినమని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే సింధు వైద్యశాల హైదరాబాద్ వారిని సంప్రదించాలని ఇంత మంచి అవకాశాన్ని పేద ప్రజలకు అందించిన తెలంగాణ యువజన సంఘము కమిటీ సభ్యులను హాస్పిటల్ వైద్య బృందం గ్రామ ప్రజలు అభినందించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాషామల్ల స్వాతి భాస్కర్, తెలంగాణ యువజన సంఘము సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోరెళ్ల విప్లవ్ కుమార్, సింధు హాస్పిటల్ (హైదరాబాద్ )వైద్యులు కోటిరెడ్డి, హానిష, శ్రీ రామ్ మార్కెటింగ్ మేనేజర్ విజయ్, ఉప సర్పంచ్ గొలుసుల వెంకటయ్య పంచాయతీ కార్యదర్శి యాకూబ్ రెడ్డి, గ్రామ పరిపాలన అధికారి ఇస్మాయిల్, వార్డు సభ్యులు నవీన్, నాయకులు నాగులగాని హరీష్,అనగందుల సంపత్ తదితరులు పాల్గొన్నారు..