తెలంగాణ ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి

Oct 16, 2024 - 19:11
 0  3
తెలంగాణ ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి

 ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో నిరసనలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం నుంచి కాలేజీల్లో క్లాసుల బంద్‌ చేస్తున్నట్లు యాజమాన్యాల నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు.. వారం తర్వాత నిరవధిక బంద్‌కు వెళ్తామని ప్రకటించాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీల్లో క్లాసులు బంద్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సుమారు రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయినట్లు సమాచారం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏళ్ల తరబడి నిధులు విడుదల చేయకపోవడంతో భారీగా బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. గత ఏడాది డిసెంబరు 7న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ ఫీజులను చెల్లించాల్సిందేనంటూ విద్యార్థులపై ఆయా కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333