తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గిలకత్తుల రమేష్ గౌడ్

Jun 18, 2026 - 07:16
 0  96
తెలంగాణ  ఉద్యమ కళాకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గిలకత్తుల రమేష్ గౌడ్

తిరుమలగిరి 18 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

మలి దశ ఉద్యమం నుండి తన అట పాటలతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన గాయకుడు ఎంతో మంది కళాకారులతో కలిసి ప్రతి జిల్లా రాష్ట్రం లో నలుమూలల తన అట పాటతో రాష్ట్రం కోసం పోరాడి వచ్చిన రాష్ట్రం లో రావలిసిన హక్కుల కోసం పోరాడుతున్న కవి గాయకుడు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కి చెందిన గిలకత్తుల రమేష్ కి హైదరాబాద్ కళాభారతి లో ఆత్మీయ సమావేశం లో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎన్నుకోవడం జరిగింది కావున గిలకత్తుల రమేష్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన సంఘం చైర్మన్ అనువోజు వెంకటేశం  అధ్యక్షులు దరువు అంజన్న  వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్  ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియచేసారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు వచ్చే వరకు సంఘం పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు కచ్చితంగా పని చేస్తాను అని అన్నారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర కమిటీ నాయకులు పేరాల యాదగిరి. జువ్వాజీ ప్రవీణ్. గజ్వేల్ ప్రతాప్. పందిరి సైదులు. కొండ్ర కుమార్.సలీమ్. రాకేష్. శారద. పరకాల రమ. మట్టెడ కవిత.పుష్ప తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి