తెలంగాణశాసనసభ స్పీకర్ పై ఎమ్మెల్సీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్న గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం.
ఎమ్మెల్సీకి విధాన సభ నడుస్తుండగా రెండు గంటలు గోడకుర్చీ శిక్ష విధించండి.
తెలంగాణ వార్త సెప్టెంబర్ 7 జిల్లా స్టాపర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా.:- తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న తొలి రోజున ఒక ఎమ్మెల్సీ అసెంబ్లీ స్పీకర్ పై అవమానకరంగా అనకూడని వినకూడని దుర్భాషలాడ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిపై ఈ విధంగా బూతు పదాలు వాడతూ విమర్శించే వాళ్లకు తగిన ప్రాయశ్చిత్తం చేస్తే గాని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆయన తెలిపారు. దళితుల తో పాటు ఇతర ఏ వర్గాల వారి పై కూడా ఈ విధమైన చర్యలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తెలిపారు.