తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు

Nov 27, 2024 - 19:39
 0  4
తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు

వరంగల్తోపాటు మరో మూడు చోట్ల ఎయిర్పోర్టులు మంజూరు చేయాలని, వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు చేపడ్తున్నామని, కేంద్రం కూడా సహకరించాలని, అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్లోనూ..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు గతంలో గుర్తించిన స్థలం అనువుగా లేనందున ప్రత్యామ్నాయంగా పాల్వంచలో 950 ఎకరాలు గుర్తించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి సీఎం రేవంత్రెడ్డి తీసుకెళ్లారు. ఆ భూమి వివరాలు ఏఏఐకి అందజేశామని, వెంటనే విమానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో గతంలో గుర్తించిన భూమి ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అనువుగా లేదని ఏఏఐ ప్రీ-ఫీజుబిలిటీ సర్వేలో తేలిందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్గాంలో 591.24 ఎకరాలు గుర్తించిందని, అక్కడ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఆదిలాబాద్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) ఆధ్వర్యంలో ఇప్పటికే 369.50 ఎకరాల భూమి ఉందని, పూర్తి స్థాయి కార్యకలాపాలకు అదనంగా 249.82 ఎకరాలు అవసరమని చెప్పారు. అదనంగా అవసరమైన భూమి సేకరించి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ కు వెంటనే ఎయిర్పోర్ట్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఎంపీలు చామల కిరణ్‌ కుమార్ రెడ్డి, కె.రఘువీర్ రెడ్డి, ఎం.అనిల్ కుమార్ యాదవ్‌, ఆర్‌.రఘురామిరెడ్డి, కడియం కావ్య కూడా ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333