తుంగతుర్తికి ఏం మొఖం పెట్టుకొని వస్తున్నావ్ కేసీఆర్ ఎమ్మెల్యే మందుల సామెల్

Mar 30, 2024 - 21:03
 0  377
తుంగతుర్తికి  ఏం  మొఖం పెట్టుకొని వస్తున్నావ్ కేసీఆర్ ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తికి ఏమున్నదని వస్తున్నావు, 

తిరుమలగిరి దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు పేరు చెప్పి కోట్లు దండుకున్న మాజీ ఎమ్మెల్యే అవినీతిని బయట పెట్టు

నీ బిడ్డ తీహార్ జైల్లో ఉంది, నీ కొడుకు కేసుల పాలయ్యిండు, 

నీ అల్లుడు నీ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందని ఎదురు చూస్తూ ఉండు,

నీ కుటుంబం మొత్తం ఆగమైపోతుంది, అధికారంలో ఉన్నప్పుడు నీవు చేసిన పాపాలే నిన్ను నీ పార్టీని బొంద పెట్టింది 

తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే అప్పుడున్న ఆస్తులు ఎంత ఇప్పుడున్న ఆస్తులు ఎంత.

ఈ నాలుగు నెలల్లో తిరుమలగిరి ఇంటర్ కాలేజ్ , తుంగతుర్తి లో 100 పడకల హాస్పిటల్ తో 150 కోట్ల తో రోడ్ల నిర్మాణం చెంసిన.

కాంగ్రెస్ పార్టీ పార్లమట ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతాం.

తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు, కెసిఆర్ మీ ఆస్తుఎంత. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ నీ కొడుకు ఏం సంబంధం లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో మీకైతే ప్రజల ఎలా బుద్ధి చెప్పారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఓటు ద్వారా అదే బుద్ధి చెప్పే తారు కేసీఆర్.

23 సంవత్సరాలుగా నీవమ్మటే ఉన్నా, నీవు కెసిఆర్ ప్రజలకు సేవ చెరయాక ఇక్కడ ఎమ్మెల్యేలతో ప్రజల నుదోచుకున్నావు.

తిరుమలగిరి 31 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండల కేంద్రం లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ మాట్లాడుతూ. తుంగతుర్తి నియోజకవర్గం లో ఏం అభివృద్ధి చేసినవ్ ఏం మొఖం పెట్టుకొని వస్తున్నావ్ కే సి ఆర్ అని ప్రశ్నించారు. మీ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మా నియోజకవర్గం కు ఎన్ని నిధులు కేటాయించావో చెప్పాలి కేసీఆర్. తుంగతుర్తిలో రుద్రమ్మ చెరువును రిజర్వాయర్ చేస్తా అంటివి, వంద పడకల హాస్పిటల్ కడతానంటివి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానంటివి, ఇయ్యాల ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు. మా తెలంగాణ బిడ్డలు నీకు ఓటుతో బుద్ధి చెప్పినా కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన చిల్లర రాజకీయాలు మానడం లేదు. ఇవాళ కాలేశ్వరం నుంచి మీ తుంగతుర్తికి నీళ్లు వస్తున్నాయి, మొత్తం తెలంగాణ కు నీళ్లు వస్తున్నాయి అని మాట్లాడుతున్నావ్, నీ ప్రభుత్వంలో కాలేశ్వరంపై లక్షల కోట్ల అవినీతి చేసి మేడిగడ్డ బ్యారేజ్ ను మూడేళ్లకే కృంగిపోయేటట్టు చేస్తిరి. నీళ్లు నిలువ ఉంటే బ్యారేజ్ కూలిపోతదేమోనని భయంతో అక్టోబర్ నెలలోనే నీళ్లు వదిలితివి. ఇప్పుడేమో కాలువలలో నీళ్లు లేకుండా చేస్తివి నీ ప్రభుత్వంలో ఉద్యమకారులను పక్కకు పెట్టితివి, మా తుంగతుర్తి నియోజకవర్గం భూకబ్జాలకు నిలయంగా, దొంగ నోట్ల ముఠాకు అడ్డాగా , హత్యా రాజకీయాలు చేసిన ఘనత మీ మాజీ ఎమ్మెల్యే కు ఉందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి మా నియోజకవర్గంలో ఎల్లకాలం సస్యశ్యామలంగా నీళ్లు అందించే మా బిక్కెరు వాగు లో ఉన్న ఇసుకను మొత్తం లూటీ చేసారని మండిపడ్డారు. ఈరోజు భూగర్భ జలాలు అంతరించిపోయినాయి. దీనికి కారణం నువ్వు కాదా కేసీఆర్. ఖబర్దార్ దమ్ముంటే మందుల సామిల్ తోటి ముఖాముఖి చర్చకు సిద్ధమేనా.? ఆనాడు మూడు ఎకరాల భూమిలేని మీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇవాళ మూడు వందల ఎకరాల భూస్వామి ఎలా అయిండు మీకు తెలియదా అని ప్రశ్నించారు. నీ బిడ్డ కవితమ్మ ఎందుకు జైలుకుపోయిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు టాంపరింగ్ చేసిన దుర్మార్గుడివి అని అన్నారు. త్వరలోనే నీ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నీ పార్టీ భూస్థాపితం అవడం ఖాయం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని గుర్తుచేశారు. మా తుంగతుర్తిలో ఏం చేయడానికి వస్తున్నావు నీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై తిరగబడడానికి మా తుంగతుర్తి ప్రజలు ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ మీడియా ఇంచార్జ్ కందుకూరి లక్ష్మయ్య, కౌన్సిలర్లు బత్తుల శ్రీను భాస్కర్ చాగంటి అనసూయ రాములు ఎంపిటిసి జిమ్మిలాల్, మరియు కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034