తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా సుంకరి జనార్ధన్
తిరుమలగిరి 03 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సుంకరి జనార్ధన్ నియమితులయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే మందుల సామెల్ డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య మాజీ డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు మండల వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలను అన్ని విధాల ఆదుకుంటానని అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తానని అన్నారు...