తాసిల్దార్ కి వినతి పత్రం

Oct 18, 2024 - 20:15
Oct 18, 2024 - 20:35
 0  1
తాసిల్దార్ కి వినతి పత్రం

పీసా గ్రామసభ ద్వారాగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ జరగాలని తాహసీల్దార్ కి వినతి పత్రం...గొండ్వాన సంక్షేమ పరిషత్

  ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు... జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి

వెంకటాపురం అక్టోబర్ 18 తెలంగాణ వార్త:-

ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా ప్రభుత్వాలు చెయ్యాలని, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ పిసా గ్రామసభ తీర్మానంతో జరపాలని జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి డిమాండ్ చేశారు,

శుక్రవారం నాడు వెంకటాపురం మండల తాసిల్దార్ లక్ష్మి రాజయ్యకి గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో పిసా గ్రామ సభలు ఏజెన్సీ గ్రామాలలో పూర్తిస్థాయిలో జరపాలని ,పీసా గ్రామసభ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరగాలని మెమొరాండం ఇవ్వడం జరిగింది,అనంతరం పూనెం సాయి తాహిసీల్దార్ కి వివరిస్తూ.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ సరైన పద్ధతి కాదని,రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ (342) ప్రకారంగా 1/70 చట్టాన్ని అనుసరించి ఏజెన్సీ ప్రాంతంలో పూర్తి హక్కులు పిసా గ్రామ సభలకే ఉంటుందని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కీలక పాత్ర పిసా గ్రామసభలకే ఉంటుందని ఆయన అన్నారు.అధికార యంత్రాంగం కూడా ఏ మాత్రం ఏజెన్సీ ప్రాంత చట్టాలు పట్టించుకోకుండా వ్యవరిస్తున్నారని వాపోయారు.ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పని చేయడం సరైన పద్ధతి కాదనీ ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలని కోరారు ,ఏజెన్సీ ప్రాంతంలో 33 జీవో లో కలిగిన మార్పులు పెసా చట్టానికి అనుగుణంగా మార్చాలని పూనెం సాయి డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతాల్లో మొదటి ప్రాధాన్యత ఆదివాసి కుటుంబాలకి ఇవ్వాలని అన్నారు,గత ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేసిందని, ఏ ఒక్క ఆదివాసి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని ఆయన తెలిపారు.అదే తప్పు చెయ్యకుండా పీసా గ్రామసభ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కణితి వెంకటకృష్ణ కార్యనిర్వహక అధ్యక్షులు పూనెం ప్రతాప్ పాల్గొన్నారు.