తాటి ముంజ సీజనల్ ఫ్రూట్ దాసరి వీరన్న

Apr 29, 2025 - 12:45
 0  90
తాటి ముంజ సీజనల్ ఫ్రూట్ దాసరి వీరన్న

అడ్డగూడూరు 29 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- వేసవి కాలంలో ఇది ఒక మధురమైన ఫ్రూట్ ఇది మానవులు ముంజను తింటే వేడిని తీసివేసి చల్లగా వారి శరీరానికి ఇస్తుంది.ఇది మనిషి శరీరంలో టాక్సిన్స్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది.ఇది శరీరం యొక్క సహజ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.ఐస్ యాపిల్ లేదా నంగు సహజ శీతలకరణి, ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.ఇది.తాటి ముంజెల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తాటి ముంజెలు ఎండధాటి నుంచి రక్షణ కల్పిస్తాయి.100గ్రాముల ముంజెల్లో 43 కేలరీలు ఉంటాయి.మూడు తాటి ముంజెలు తిన్నట్లయితే,ఒక కొబ్బరి బొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది.లేత తాటిముంజెల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది.వీటిలో విటమిన్లు,ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజెలు చక్కని ఫలహారం. ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటిముంజెల నీటిని పట్టిస్తే దురద తగ్గి,అవి త్వరలోనే మానిపోతాయి.కొన్ని ప్రాంతాల్లో తాటిముంజెలతో శీతల పానీయాలను కూడా తయారు చేస్తారు.తమిళనాడులో తాటిముంజెల పానీయాన్ని ఎలనీర్‌ నుంగు అంటారు అని దాసరి వీరన్న చెప్పుకొచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333