తాజాగా ఓ జర్నలిస్టు పై నోరు పారేసుకుని మళ్లీ చర్చకు తెర తీసిన:ఎంపీ అరవింద్
నిజామాబాద్ ఏప్రిల్ 05 తెలంగాణవార్త ప్రతినిధి:- అర్వింద్ ఓ అంహకారి..!ఓ కుసంస్కారి..!! నడిమంత్రపు సిరితో కన్నుమిన్నుగానకుండా ఉన్న నేత..!!! ఇంకా..ఇంకా.. ఇవన్నీ ఆ పార్టీ నేతలే అంటున్న మాటలు.అవును.. మరి అలాగే ఉంది అతగాడి వైఖరి.సీఎం కూతురు కవితనే ఓడగొట్టి గెలిచిన అనే అహం పెరిగి పెద్దదై వటవృక్షమై కళ్లు నెత్తికెక్కి ఇప్పుడు అదే కొంపముంచే స్థాయికి తెస్తున్నది.నోరు పారేసుకుంటే సరి..గట్టిగా నాలుగు బూతులు తిడితే మాస్.. పెద్దోళ్లను తిడితే అదే తనకు మైలేజీ అనే సూత్రాలను నమ్ముకుని నేత అర్వింద్.అది తొలత కొంత పనికి వచ్చింది. గుర్తింపూ తెచ్చింది.ఇప్పుడు పరమ చెత్తగా అనిపిస్తుంది ప్రజలకు.రొటీన్ మాటలు సుత్తికొడుతున్నాయి. ఎప్పుడూ మాటలు చెప్పడమేనా..? వీడీయోలు వదులుతూ సెల్ప్ డబ్బా కొట్టుకోవడమేనా..?? చేసిందేమీ లేదా..? ఇక ఉండదా.. ? అనే రేంజ్లో అతగాడి ప్రవర్తన మొహం మొత్తించేలా ఉంది.ఇదంతా ఎందుకు చెబుతున్నావ్.. అంటారా..! వస్తున్నా.