తల్లి పేరుపై ఒక మొక్క నాటుదాం..! పర్యావరణాన్ని కాపాడుదాం

Sep 25, 2026 - 19:39
 0  1
తల్లి పేరుపై ఒక మొక్క నాటుదాం..! పర్యావరణాన్ని కాపాడుదాం
తల్లి పేరుపై ఒక మొక్క నాటుదాం..! పర్యావరణాన్ని కాపాడుదాం
తల్లి పేరుపై ఒక మొక్క నాటుదాం..! పర్యావరణాన్ని కాపాడుదాం

రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును కానుకగా ఇద్దాం.

 - కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి
 జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి తల్లి పేరుపై ఒక మొక్క నాటే లక్ష్యంతో ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో “తల్లి పేరుపై ఒక మొక్క” కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి ప్రారంభించారు.

  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు, అంతస్తులు కూడబెట్టడం కంటే, వారికి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే నిజమైన సంపద అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుపై ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును అందించవచ్చని పేర్కొన్నారు.

   కరోనా సమయంలో వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి మాస్కులు ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. “ఈరోజు మనం చెట్లను నాటకపోతే, భవిష్యత్తులో ఆక్సిజన్‌ కోసం ప్రతి ఒక్కరూ ఆక్సిజన్‌ బాటిల్‌ తగిలించుకుని తిరిగే పరిస్థితి రావచ్చు” అని ఆమె హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై బాధ్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

   ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీమతి స్రవంతి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు మాధవి, శిరీష, రేవతి, ప్రియాంకతో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అక్షయ, అక్షిత, హర్షద్, వరుణ్ వెంకట్ తేజ తోటి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333