ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వెల్లడించారు..!

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయలేదు అని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చాను. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలోనూ నా వంతు పాత్ర పోషించాను అని మల్లు రవి తెలిపారు. కొంతమంది ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవి ఉంది కదా మల్లు కు టికెట్ ఎందుకు.. మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసేందుకు నేను వారం రోజుల క్రితమే ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశానని మల్లు రవి చెప్పారు. తప్పనిసరిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.