ఢిల్లీలో అఖండ మెజారిటీ విజయం""ఖమ్మం నగరంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అఖండ మెజార్టీతో విజయం సాధించినందుకు ఖమ్మం నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది అధికార ప్రతినిధి మారుతి వీరభద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఢిల్లీలో అవినీతి ఆశ్రితపక్షపాతము కుటుంబ పాలన కుంభకోణాలమయం జరిగిందని, ప్రజలు గమనించారని కేజ్రీవాల్ ని తిరస్కరించారని, ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది, ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో గాని కేంద్రంలో కానీ డబల్ ఇంజన్ సర్కారు మాత్రము ఉంటే అభివృద్ధి జరుగుతుందని ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి శూన్యమని విశ్వసించారని, మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే మద్దతు తెలిపారని, తెలంగాణలో ఇది విజయానికి సంకేతం అని తెలియజేయడం జరిగినది
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మందా సరస్వతి, బోయినపల్లి చంద్రశేఖరు, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు రీగన్ ప్రతాపు, వన్ టౌన్ అధ్యక్షులు గడీల నరేష్, సీనియర్ నాయకులు పిల్లలమర్రి వెంకటు డీకొండ శ్యాంసుందర్ టూ టౌన్ అధ్యక్షులు వెంకట్ నారాయణ, దాసరి మధు, పొట్టి ముత్తి జనార్ధను గుర్రాల నాగేందరు, మన్నెం నాగమణి దొడ్డపు నేను అప్పారావు తదితరులు పాల్గొనడం జరిగినది