డ్రోన్ సహాయంతో టిబి శాంపిల్స్ సేకరణ
అడ్డగూడూరు17 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గట్టుసింగారం గ్రామంలో శుక్రవారం రోజు టీబీ లక్షణాలు వున్నా వారి నుండి శాంపిల్స్ తీసి రామన్నపేట ఏరియా ఆసుపత్రికి పంపి అక్కడినుండి బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలింపు ఈ సందర్భంగా అడ్డగూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భరత్ కుమార్ మాట్లాడుతూ..ఈ డ్రోన్ వల్ల ప్రతి ఒక్క మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడున్నటువంటి టీ బి లక్షణాలు కలిగిన వారి నుంచి శాంపిల్స్ తీసి త్వరగా ఆస్పత్రులకు పంపించడం వల్ల వారి యొక్క లక్షణాలు ఉన్నట్లయితే పేదవారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు తక్కువ సమయంలో టీబీ లక్షణాలున్న వారికి మెడిసిన్ అందించడం ఈ డ్రోన్ చాలా ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ శారదా. సూపర్వైజర్ సరోజన.ఎం ఎల్ హెచ్ పి మౌనిక. ఏఎన్ఎం విజయ. ఎయిమ్స్ సిబ్బంది. ఎస్ విద్యాసాగర్. నందాకిశోర్.డ్రోన్ పైలెట్స్.ఆశ కరకర్తలు దుర్గమ్మ. మదనమ్మ. ఎస్టిఎల్ఎస్ జానకి తదితరులు పాల్గొన్నారు.