డ్రోను రెక్కలు తగిలి ఇద్దరికీ గాయాలు.. కర్నూలు ఆస్పత్రికి తరలింపు

Aug 13, 2025 - 19:28
 0  30
డ్రోను రెక్కలు తగిలి ఇద్దరికీ గాయాలు.. కర్నూలు ఆస్పత్రికి తరలింపు

 జోగులాంబ గద్వాల 13 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  మానవపాడు. పొలంలో పురుగుల మందు కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు డ్రోన్ రెక్కలు తగిలి  ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ఓరైతుకు చెందిన మొక్కజొన్న పంటకు ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన అలీ బాబు (డ్రోన్ యజమాని ) డ్రోన్ సహాయంతో మందులు పిచికారి చేశాడు, ఆయనతోపాటు బొంకూరు గ్రామానికి చెందిన నాగన్న ను, ఆలీ బాబు కూలి కోసం వెంట తెచ్చుకున్నాడు. అయితే డ్రోను ను కిందకు దించే సమయంలో  ప్రమాదవశత్తు నాగన్న కుడి చేతికి రెండు వేళ్ళు తెగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. డ్రోన్ యజమాని అలీ బాబుకు స్వల్ప గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను  108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333