డ్రైవర్ ప్రమాద భీమా 5లక్షల రూపాయల చెక్కును అందజేసిన

Aug 29, 2026 - 21:40
Aug 30, 2026 - 00:22
 0  6
డ్రైవర్ ప్రమాద భీమా 5లక్షల రూపాయల చెక్కును అందజేసిన
డ్రైవర్ ప్రమాద భీమా 5లక్షల రూపాయల చెక్కును అందజేసిన
డ్రైవర్ ప్రమాద భీమా 5లక్షల రూపాయల చెక్కును అందజేసిన

మాజీ మంత్రి,ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ 

మోతె/ హుస్సేనాబాద్, 30 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మోతె మండలము హుస్సేనాబాద్ గ్రామానికి చెందిన రేఖ మల్లయ్య వృత్తి రీత్యా కారు డ్రైవర్ తన డ్యూటీ ముగించుకొని కారు యజమానికి అప్పగించి కోదాడ నుండి సూర్యాపేటలోని తన ఇంటికి  బస్సు లో బయలుదేరి శాంతినగర్ రాగానే బస్సు దిగుదామని కొంచెం ముందుకు రాగానే బస్సు డ్రైవర్  ముందు ఉన్న ఈసుక లారీ ని డి కొట్టడంతో  బస్సు లో నిల్చున్న మల్లయ్య బస్సు లో నుండి ఎగిరిపడి బస్సు చక్రాల కింద పడటంతో  అక్కడిక్కడే మృతి చెందడం జరిగింది. ఈరోజు వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన డ్రైవర్ ప్రమాద భీమా నుండి మంజూరు అయిన ₹5,00,000/- (ఐదు లక్షల) రూపాయల చెక్కును మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం ట్రాన్పోర్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో రేఖ మల్లయ్య భార్య  అనితకి అందజేసారు.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి, మాట్లాడుతూ..కెసిఆర్. డ్రైవర్ ప్రమాద భీమా ను 2015 వ సంవత్సరంలో  డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 23 లక్షల మంది ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి ఈ భీమా వర్తిస్తుంది. ఇందులో ఆటో డ్రైవర్లు కార్ డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ అందరికీ పథకం వర్తిస్తుంది. దీనివల్ల ఎవరైనా డ్రైవర్ ప్రమాదంలో చనిపోతే వారి ఆ కుటుంబం రోడ్డు మీద పడకూడదని ఈ భీమా ఆ కుటుంబానికి ఆర్థిక.వెసులుబాటు కల్పించే విధంగా తోడ్పడుతుందని  కేసీఆర్, భావించడం జరిగింది ఈ పథకాన్ని 2015 నుండి 2024 వరకు కొనసాగించడం జరిగింది.

అబ్బదపు హామీలతో అధికారంలోకి వచిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం  పథకాన్ని రద్దు చేయడం జరిగింది . దీనివల్ల రవాణా రంగమే తన ఉపాధిగా భావించే డ్రైవర్ సోదరులు ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురై మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రేస్  ప్రభుత్వంవచ్చి దాదాపు రెండున్నర ఏళ్ళు గడిచిన ముఖ్యమంత్రి గాని రవాణా శాఖ మంత్రి గాని,కార్మిక శాఖ మంత్రి గాని ఇట్టి భీమా పథకము గురుంచి ఎలాంటి సమావేశంనిర్వహించిందేలేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్,రిజిస్ట్రేషన్,టాక్స్ ల ద్వారా వేల రూపాయలు వెహికిల్ ఓనర్స్,డైవర్స్ నుండి వసూలు చేస్తున్న ప్రభుత్వం రవాణా రంగంను నమ్ముకున్న డ్రైవర్లకు మొండి చెయ్యి చూపిస్తుంది. అదేవిధంగా  ఆటో డైవర్ల భృతి క్రింద సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదు అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వై వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు నూకల యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్ లింగారెడ్డి, సర్పంచులు అక్కినపల్లి శ్రీరాములు, కోడి లింగయ్య, ఇందిరాల సుప్రజ శ్రీనివాస్, యాతాకుల విజయలక్ష్మి, నాగయ్య, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు కోటేశ్వరావు, మాజీ రైతు జిల్లా సమన్వయ సభ్యులు కోటా రామ్ రెడ్డి, జాన్ రెడ్డి, దుశ్చర్ల మహేష్ ఉపసర్పంచ్ దుశ్చర్ల ఉపేందర్, షేక్ రఫీ, కమునపెల్లి లక్ష్మయ్య, నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333