డ్రగ్స్,సైబర్ నేరాలపై  అవగాహన

Jan 27, 2025 - 19:24
 0  3
డ్రగ్స్,సైబర్ నేరాలపై  అవగాహన

 తుంగతుర్తి జనవరి 27 తెలంగాణ వార్త ప్రతినిధి:  ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు  తుంగతుర్తి CI శ్రీనివాస్ నాయక్ గారు, SI క్రాంతి కుమార్ గారు, మండల కేంద్రంలోని తెలంగాణ సాఘిక గురుకుల పాఠశాల మరియు కళాశాల లో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై  పోలీసు కళాభృందంతో  అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.* 

 ASI  భగవాన్ గారూ మాట్లాడుతు  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి అధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు,గుట్కాపై  పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు,  బ్యాంక్ ఖాతా, ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తె *లిపినారు. 
 
 వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు 
గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు. 
 అనంతరం పోలీసు  కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు 

 ఈ కార్యక్రమం నందు తెలంగాణ సాఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ రాంబాబు,సాయికుమార్, హోoగార్డ్ ప్రసాద్, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ, నాగార్జున ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333