డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిలో పది మందికి ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ మరియు జరిమానా
ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు తనిఖీలు
పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం
సూర్యాపేట, 25 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- మద్యం సేవించి వాహనాలు నడిపిన పది మందికి ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ మరియు జరిమానా సూర్యాపేట కోర్టు విధించినట్లు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన పది మందిని ఈరోజు 24-03-2026 నాడు కోర్టులో హాజరుపర్చగా పది మందికి ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ మరియు అందరికి కలిపి రూ.15,000/- జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి గోపు రజిత గారు తీర్పు వెల్లడించినట్లు ఎస్సై తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ, IPS ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు... పోలీసులు చేసే వాహన తనిఖీలు ప్రజల ప్రాణరక్షణ కోసమే అని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు....