డెంగ్యూతో ఆందోళన చెందవద్దు..నోడల్ పర్సన్. లింగం రామకృష్ణ
మునగాల 14 సెప్టెంబర్ 2024
తెలంగాణ వార్త ప్రతినిధి :-
మునగాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల పరిధిలోని నర్సింహులగూడెం గ్రామం నందు డెంగ్యూ నివారణ పర్సన్ లింగం రామకృష్ణ మాట్లాడుతూ పరిసరాల పారిశుధ్యం మరియు దోమల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించారు.. ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంటూ రోగాల బారిన పడకుండా చూసుకోవాలని కోరారు. ప్రస్తుత వర్షాకాలంలో తీవ్రంగా వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోదకాలు, మెదడువాపు, హెపటైటిస్ బి కామెర్లు, టైఫాయిడ్ పలు రకాల వ్యాధులను అరికట్టడానికి పరిశుభ్రమైన నీరు, ఆహారం, పారిశుద్ధ్యంతోనే సాధ్యమని ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు.. గృహాల మధ్యలో పెంటకుప్పలు లేకుండా చేయాలి, మరుగుదొడ్లనే వాడాలి మల విసర్జన బయట చేయరాదు ఏడీస్ ఈజిప్టీ దోమ మంచినీళ్లలోనే పెరుగుతుంది కాబట్టి ఇది డెంగ్యు జ్వరాన్ని కలగజేస్తుంది దోమల పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలి దోమతెరలను వాడాలి.. గ్రామములో ఆశ వర్కర్లతో ఫీవర్ సర్వే నిర్వహించి మందులను పంపినీ చేశారు..దోమల నివారణ కోసం నీటి గుంటలో ఆయిల్ బాల్స్ వేశారు,మురుగు కాలువల్లో టెమీఫాస్ ధ్రావణాన్ని గ్రామపంచాయతీ సిబ్బందితో పిచికారి చేపిoచారు.. ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల చెప్పులకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు..వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ గృహాల్లో దోమల నివారణకోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. వీదులలో బ్లీచింగ్ పౌడర్ చల్లించటం జరిగింది, ప్రజలందరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తం గా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి భాస్కర్ రాజు,ఏఎన్ఎం పద్మ
గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్, సిబ్బంది పరశురాములు, సురేష్ ,
ఆశ వర్కర్ లు లక్ష్మి ,సుధారాణి, విజయలక్ష్మి(మాణిక్యమ్మ)
తదితరులు పాల్గొన్నారు