డీడీలు కట్టిన గొల్ల కురుమల అందరికీ తక్షణమే నగదు బదిలీ చేయాలి

తిరుమలగిరి 05 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామంలో జి ఎం పి ఎస్ ఆధ్వర్యంలో మండల విస్తృతస్థాయి సమావేశం జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జి ఎం పి ఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య పాల్గొని ప్రసంగించారు గొల్ల కురుమలు రెండో విడత గొర్రెల పంపిణీ కోసం డీడీలు తీసి నేటికీ సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు రెండో విడత పంపిణీ చేయకపోవడం బాధాకరమైన విషయం గత ప్రభుత్వం గొల్ల కురుమల అందరికీ గొర్రెల పంపిణీ చేస్తామని యాదవులందరినీ కోటీశ్వరులు చేస్తామని మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం యాదవులందరినీ మోసం చేసి రెండు కోట్ల పది లక్షల రూపాయలు గత టిఆర్ఎస్ ప్రభుత్వం అట్టి డబ్బులను సుహా చేసి అధికారుల జేబులు నింపుకున్నారే తప్ప గొల్ల కురుమలను బాగు చేసిన దాఖలాలు లేవు ప్రస్తుతం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గొల్ల కురుమల సమస్యలను తక్షణమే పరిశీలించి డీడీలు తీసిన ప్రతి ఒక్క యాదవునికి వారి అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేయాలని యాదవ విద్యార్థులు చదువుకోడానికి విద్య వైద్యం అందుబాటులోకి తేవాలని 50 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క యాదవునికి నెలకు 5000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని యాదవులందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత భీమా మెడికల్ ఇన్సూరెన్స్ వాటితో పాటు ప్రమాదం చనిపోయిన యాదవులకి 10 లక్షల రూపాయలు ప్రభుత్వ నష్టపరిహారం ఇవ్వాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బందు లెక్క ప్రస్తుత ప్రభుత్వం గొల్ల కురుమల బంధు ప్రవేశపెట్టాలని జిఎంపిఎస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యాదవులకు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని జిఎంపిఎస్ డిమాండ్ చేస్తా ఉంది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడం లింగయ్య కన్యబోయిన కిష్టయ్య జోగం వెంకన్న కొడారి లింగయ్య కొడాలి గట్టయ్య కన్యబోయిన అవిలయ్య కన్యబోయిన రాజాలు కాసరబోయిన ఐలయ్య కొడాలి రాములు తదితరులు పాల్గొన్నారు