డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యే.

Jul 2, 2026 - 00:05
Jul 2, 2026 - 00:07
 0  2
డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యే.

తక్షణమే మాజీ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి భద్రతను పెంచాలి.

బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 జోగులాంబ గద్వాల 1 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  దేశానికి రాష్ట్రానికి ఎలాంటి సేవలు చేయని సీఎం రేవంత్ సోదరులకు ప్రభుత్వం భద్రతను ఎలా కనిపిస్తారు..? ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో బీఆర్ఎస్వి నాయకులతో కలిసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి భద్రతను పెంచాలని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ...ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరి మెడల్ తో సత్కరించిందని అన్నారు. గతంలో ఆర్ఎస్పిని తుదిముట్టించేందుకు నాలుగు సార్లు ప్రయత్నాలు జరిగాయని అన్నారు.

ప్రమాద తీవ్రతను గుర్తించిన నాటి ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎక్స్ కేటగిరి భద్రతను కల్పించిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నడన్న అక్కసుతో రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను చంపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

26 సంవత్సరాల పాటు ఐపీఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్ధుల విద్యకు ఎన్నో సేవలందించిన ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యే. 

రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది.

ఇప్పటికే పలుమార్లు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నాలు జరిగాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా వెల్లడించినప్పటికీ కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉంది.

ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోంది. 

ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను మానుకుని, మా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ కి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను.

రేవంత్‌ ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ‌భద్రతను తగ్గించడం అత్యంత దుర్మార్గమైన చర్య.

26 ఏళ్లపాటు పోలీసు ఉన్నతాధికారిగా దేశానికి, సమాజానికి సేవలందించిన వ్యక్తిపై రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం కాంగ్రెస్‌ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం. 

రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.

ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం అనుముల రేవంత్ రెడ్డి సోదరులకు ప్రభుత్వ భద్రత, వాహనాలు కల్పిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న, పలుమార్లు ప్రాణహాని హెచ్చరికలు ఎదుర్కొన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గారి భద్రతను తగ్గించడం అత్యంత అన్యాయం.

భద్రతను తగ్గించినంత మాత్రాన ప్రవీణ్‌కుమార్‌  ఆత్మస్థైర్యాన్ని, పోరాటస్ఫూర్తిని దెబ్బతీయలేరు. ప్రతిపక్షాలను అణచివేసే కక్షపూరిత రాజకీయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి.

ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కి తగిన భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్వి నాయకులు సునీల్ మాధవ్, కిరణ్, అనస్ సునీల్, యువరాజు, నరేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State