డప్పు దరువుల మధ్య సుంకులమ్మకు బోనాలు సమర్పించిన మహిళలు

Aug 25, 2026 - 18:47
 0  2
డప్పు దరువుల మధ్య సుంకులమ్మకు బోనాలు సమర్పించిన మహిళలు

 ఊరు ఊరంతా పండగ వాతావరణం మధ్యలో పెద్ద ఎత్తున సుంకులమ్మ తల్లికి బోనాలు సమర్పించిన మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు అందుకునే ప్రముఖ గ్రామదేవ ఈమెను భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా గ్రామాన్ని ప్రజలను చల్లగా చూసే తల్లిగా కొలుస్తారు.

 గ్రామంలో ఉండే మహిళలు, పెద్దలు పిల్లలు ఊరు ఊరంతా అమ్మవారికి బోనం ఎత్తుకొని ఊరేగింపుగా డప్పుల,ఆటపాటల తోటి అమ్మవారికి బోనంలో ఉన్న నైవేద్యాన్ని సమర్పించారు.

 ఆ తర్వాత అలంకరణలో ఉన్న అమ్మవారిని పెద్ద ఎత్తున చిన్న పెద్ద తేడా లేకుండా  దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

 పురాణాల ప్రకారం సుంకులమ్మ పూర్వజన్మలో ఒక సామాన్య మానవశ్రీ. ఆమె పరమ పతివ్రత మరియు దైవభక్తి కలిగిన మహిళ అయితే సమాజంలోని కొన్ని దుష్ట శక్తులు లేదా అన్యాయాల కారణంగా ఆమె తీవ్రమైన అవమానానికి లేదా కష్టాలకు గురైంది ఆ అన్యాయాన్ని తట్టుకోలేక ఆమె తన ప్రాణాలను త్యాగం చేసి అగ్ని ప్రవేశం చేసింది. సుంకులమ్మ చనిపోయే సమయంలో ఆమె దృష్టిలో శిక్షిస్తానని తనను నమ్ముకున్న ప్రజలను ఎల్లవేళలా కాపాడుకుంటూ గ్రామ దేవతగా నిలుస్తానని శపథం చేసింది అలా సామాన్య మహిళా గా ఉన్న ఆమె తన పవిత్రత మరియు ఆత్మ బలిదానంతో శక్తి స్వరూపిణిగా మారింది. అని గ్రామస్తులు తెలియజేశారు 

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State