టోల్ ప్లాజా నూతన భవనం ప్రారంభించిన ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి

Mar 27, 2025 - 19:45
 0  5
టోల్ ప్లాజా నూతన భవనం ప్రారంభించిన ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి
టోల్ ప్లాజా నూతన భవనం ప్రారంభించిన ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ వార్త మాడుగులపల్లి మార్చి 27 : మాడుగులపల్లి మండలం, మాడుగులపల్లి గ్రామంలో నార్కెట్పల్లి అద్దంకి ( నామ్ ఎక్స్ప్రెస్వే ) వారు నూతనంగా నిర్మించిన  టోల్ ప్లాజా భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి హాజరవ్వడం జరిగింది. అనంతరం ఆయన క్యూబ్ హైవే సి ఓ ఓ డా భగవాన్ రాజు  తో కలసి రిబ్బన్ కట్ చేసి బిల్డింగ్ ను ప్రారంభించారు . ఈ సందర్భంగా హైవే సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని , యాక్సిడెంట్ జోన్లను కూడా గుర్తించి ప్రమాదాలు నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడం వంటి పనులు హర్షించదాయకంగా ఉన్నాయన్నారు అదేవిధంగా హైవే రోడ్డు ఎక్కడైనా మరమ్మత్తులకు  పర్యవేక్షించుకొని వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటున్నారని తెలియజేసారు . ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ వెంకటేశ్వర రావు, ఈ ఈ శ్రీధర్ రెడ్డి, డి ఈ ఈ గణేష్, టి ఎల్ శ్రీనివాసరావు, రీజనల్ హెడ్ కృష్ణారావు, ప్రాజెక్ట్ హెడ్ శ్రీకాంత్ బాబు, డిప్యూటి ప్రాజెక్ట్ హెడ్ ప్రసాద్, సీనియర్ నాయకుడు మేనేజర్ ముకేష్,ప్లాజా మేనేజర్ వెంకటేశ్వర్లు , మేనేజర్స్ రాము ,షాదుల్లా ,మల్లేష్,నరేష్ మరియు నామ్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333