జ్యోతిబాపూలే స్ఫూర్తితో బహుజన ఉద్యమాన్ని నిర్మించాలి

బీసీల హక్కుల కోసం  రాజ్యాంగబద్ధ పోరాటాన్ని ముమ్మరం చేయాలి

Apr 12, 2025 - 00:39
Apr 12, 2025 - 01:10
 0  4
జ్యోతిబాపూలే స్ఫూర్తితో బహుజన ఉద్యమాన్ని నిర్మించాలి

అణగారిన వర్గాల కోసం  మహిళలు కార్మికులు అణచివేతకు గురవుతున్న సబ్బండ వర్గాల కోసం తమ జీవితాన్ని ధారబోసినటువంటి  జ్యోతిబాపూలే జీవితాన్ని స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని నేటి యువత సమాజం పనిచేయాలని అసమానతలు అంతరాలు కుల వివక్ష పైన పోరాటానికి సిద్ధం కావాలని  అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బీసీ నాయకులు వడ్డేపల్లి మల్లేశం పిలుపునిచ్చారు. 11 ఏప్రిల్ 2025 శుక్రవారం రోజున జ్యోతిబాపూలే 198వ  

జయంతిని పురస్కరించుకుని హుస్నాబాద్ లోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాలులో జరిగినటువంటి  బీసీల చైతన్య సదస్సుకు అధ్యక్షత వహిస్తూ వడ్డేపల్లి మల్లేశం అణగారిన వర్గాల కు ఆశాజ్యోతి గా నిలిచిన  జ్యోతిబాపూలేను ఆదర్శంగా తీసుకోవడానికి ముఖ్యంగా బీసీ సమాజం దళితులు ఆదివాసీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేకంగా కుల గణన చేపట్టి 42 శాతం స్థానిక సంస్థలు సామాజిక విద్యా ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ చేసిన బిల్లును స్వాగతిస్తూనే  దానిపైన కేంద్రంతో ఒప్పించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో నమోదు చేయించడం ద్వారా రాష్ట్ర బీసీలకు  హక్కులను కల్పించాలని ఆ వైపుగా  కేంద్ర ప్రభుత్వం పైన బీసీ ఉద్యమాలు ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. కేవలం 42 శాతం  స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలతోనే సరిపోదని చట్టసభల్లో  బీసీలకు సంబంధించి 56% రిజర్వేషన్  కల్పించే బిల్లును కేంద్రం ఆమోదించి  బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించడం తమ బాధ్యతగా స్వీకరించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చేసిన సూచనలు పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించాలని ఆయన సందర్భంగా కోరారు. సింగిల్ విండో చైర్మన్ బీసీ నాయకులు బొ లిశెట్టి శివయ్య గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో  పలువురు బీసీ నాయకులు దళిత సంఘాల నాయకులు ప్రజాసంఘాలు  బుద్ధి జీవులు మేధావులు పాల్గొన్నారు. బీసీ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్  హుస్నాబాద్ ఇతర మండలాల అధ్యక్ష కార్యదర్శులు  ఇతర బీసీ నాయకులు  ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. బీసీ చైతన్య సదస్సు పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో బీసీ వర్గాలలో ఆనందం  చోటు చేసుకున్నది అనడంలో సందేహం లేదు.

----వడ్డేపల్లి మల్లేశం  

హుస్నాబాద్ బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు,  అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు  హుస్నాబాద్. జిల్లా సిద్దిపేట.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333