జోరుగా జిల్లా ప్రభుత్వ కళాకారుల అవగాహన కార్యక్రమలు

Aug 11, 2026 - 16:05
 0  5

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వర్షాకాలం లో వచ్చే విషజ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని

జోరుగా జిల్లా ప్రభుత్వ కళాకారుల అవగాహన కార్యక్రమలు

జోగులాంబ గద్వాల 11 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మానో పాడు మండలం కలుకుంట్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి ఆరిఫ్ ఉద్దీన్  ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై మరియు వర్షాకాలం లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విషజ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమలు చేపట్టిన తెలంగాణ సాంస్కృతి సారధి ప్రభుత్వ కళాకారుల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రాహుల్, హజరత్.సువర్ణ.రాధ.కేశవులు.డి.కృష్ణయ్య. శ్రీనివాసులు.కేశవులు తమ ఆట పాట మాటలతో. ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333